సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

'అరణ్య' హిందీ వెర్షన్ రిలీజ్ వాయిదా... కారణం ఇదే!

రానా దగ్గుబాటి, విష్ణు విశాల్ హీరోలుగా నటించిన చిత్రం  "అరణ్య". తమిళంలో 'కాడన్'. హిందీలో 'హథీ మేరీ సాథీ. ఇలా మూడు పేర్లతో మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈ నెల 26వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే, ఇపుడు హిందీ రిలీజ్‌ను వాయిదా వేశారు. 
 
మహారాష్ట్రతో పాటు కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్‌ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహించారు.
 
కొవిడ్‌19 మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. తెలుగులో ‘అరణ్య’, తమిళంలో ‘కాదన్‌’ యధావిధిగా మార్చి 26న విడుదలవుతాయని స్పష్టం చేసింది.
 
కాగా, కరోనా వైరస్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత చిత్రసీమ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కేసులు పెరుగుతుండడం చిత్ర పరిశ్రమను మరోసారి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది.