ఆయనపై గౌరవంతో మసాజ్ చేశా.. బాత్రూమ్‌కు వెళితే వెనుకనే వచ్చి...
మరో బాలీవుడ్ దర్శకుడుపై నటి లైంగిక ఆరోపణలు చేసింది. ఆ దర్శకుడు పేరు సుభాయ్ ఘాయ్ కాగా, ఆ నటి పేరు కేట్ శర్మ. ఈమె బాలీవుడ్ మోడల్ కూడా కావడం గమనార్హం. గత ఆగస్టు 6వ తేదీన తనకు కబురు పెట్టడంతో సుభాష్ ఇంటికి వెళ్లినట్టు చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో ఆయనతో పాటు మొత్తం ఆరుగురుకుపైగా ఉన్నారు.
తనను చూసి దగ్గరకు పిలిచిన సుభాష్ ఘాయ్.. మసాజ్ చేయమని అడిగాడనీ, కొంతసేపు తటపటాయించి ఆ తర్వాత ఆయనపై ఉన్న గౌరవంతో 3 నిమిషాలపాటు మసాజ్ చేసినట్టు చెప్పింది. అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్ రూమ్‌కు వెళ్లగా, నావెంటే ఆయన కూడా వచ్చారని, ఏదో మాట్లాడాలని చెప్పిన ఆయన గదిలోకి తీసుకెళ్లారని ఆరోపించింది.
ఆ తర్వాత తనను దగ్గరకు లాక్కొని కౌగిలించుకోబోయారని, ముద్దుపెట్టుకునేందుకు యత్నించారని ఆరోపించింది. ఓ రాత్రి ఆయనతో గడపకపోతే చిత్ర పరిశ్రమకు తనను నటిగా పరిచయం చేయనని సుభాష్ ఘాయ్ బెదిరించారంటూ కేట్ శర్మ సంచలన ఆరోపణలు చేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని మీటూ ఉద్యమం కుదిపేస్తున్న తరుణంలో నటి, మోడల్ అయిన కేట్ శర్మ అదీ కూడా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై సంచలన ఆరోపణలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.