మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 10 జూన్ 2017 (03:54 IST)

‘100% లవ్‌’ తమిళ రీమేక్‌‌లో కుమారి కాదల్.. లావణ్య, తమన్నాల ఛాన్స్ కొట్టేసింది

అదృష్టం నెత్తిమీద ఉన్నప్పుడు తన్నినా బూర్లగంపలో పడతారంటే ఇదే మరి. టాలివుడ్, కోలివుడ్‌లలో దూసుకు పోతున్న తమన్నా, లావణ్య త్రిపాఠిలలో ఒకరికి తగలాల్సిన బంపర్ ఆఫర్ మన కుమారి 21 ఎప్ హెబ్బా పటేల్‌ ఒళ్లోకి వచ్చి వాలింది. తెలుగులో సూపర్ హిట్ సాధించిన ‘100% ల

అదృష్టం నెత్తిమీద ఉన్నప్పుడు తన్నినా బూర్లగంపలో పడతారంటే ఇదే మరి. టాలివుడ్, కోలివుడ్‌లలో దూసుకు పోతున్న  తమన్నా, లావణ్య త్రిపాఠిలలో ఒకరికి తగలాల్సిన బంపర్ ఆఫర్ మన కుమారి 21 ఎప్ హెబ్బా పటేల్‌ ఒళ్లోకి వచ్చి వాలింది. తెలుగులో సూపర్ హిట్ సాధించిన ‘100% లవ్‌’ తమిళ రీమేక్‌లో హెబ్బా నటించబోతున్నట్లు ధ్రువీకరించారు.
 
‘అలా ఎలా’ చిత్రంతో తెలుగులోకి పరిచయమై, ‘కుమారి 21ఎఫ్‌’తో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు హెబ్బా. ఇప్పుడీ కుమారి తెలుగులో హిట్‌ అయిన ‘100% లవ్‌’ తమిళ రీమేక్‌లో నటించబోతున్నారు. ముందు తెలుగులో చేసిన తమన్నానే తీసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సడన్‌గా లావణ్యా త్రిపాఠి తెరపైకొచ్చారు. అయితే ఫైనల్‌గా హాట్‌ గాళ్‌ హెబ్బా పటేల్‌కు ఆ ఛాన్స్‌ దక్కిందట. అధికారికంగా సైన్‌ చేయడమే ఆలస్యం. 
 
తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ హీరోగా చంద్రమౌళి దర్శకత్వంలో తెలుగు ‘100% లవ్‌’కి దర్శకత్వం వహించిన సుకుమార్‌ ఈ రీమేక్‌ను నిర్మించనుండటం విశేషం. మూడేళ్ల క్రితమే హెబ్బా తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు. 2014లో వచ్చిన ‘తిరుమణమ్‌ ఎన్నుమ్‌ నిక్కా’లో స్మాల్‌ రోల్‌ చేశారు.