1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (21:22 IST)

కంచె బ్యూటీ.. అందాలతో కంచె దాటేసిందిగా..?!

టాలీవుడ్ హీరోయిన్, కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయాజానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ప్ర‌గ్యా, ఆ తర్వాత మళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ నెటిజ‌న్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ముఖ్యంగా గ్లామ‌ర్ విష‌యంలో ఈ అమ్మ‌డు హ‌ద్దులు దాటిపోతుంది.
 
తాజాగా ప్ర‌గ్యా జైస్వాల్ అందాలు ఆర‌బోస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. కాగా, నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా సక్సెస్ పై ప్రగ్యా ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది.