1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 10 జులై 2021 (15:55 IST)

బ్యూటీపార్లర్‌నే శృంగార గదిగా మార్చుకున్న వివాహిత, ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ..?

పెళ్ళయ్యింది. పిల్లలున్నారు. భర్త రెండు చేతులా బాగా సంపాదిస్తున్నాడు. ఇంట్లో ఉన్నా బోర్ కొడుతున్నట్లు భర్తకు చెప్పి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. అదే ఆమె కుటుంబాన్ని నాశనం చేస్తుందని అనుకోలేదు. బ్యూటీ పార్లర్లో ఉన్న ఆమె ఆలోచన పక్కదారి పట్టింది. బ్యూటీపార్లర్‌నే శృంగార గదిగా మార్చింది. ఒక వ్యక్తితో పరిచయం పెంచుకుని చివరకు ప్రాణాలనే పోగొట్టుకుంది.
 
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని సోమనూర్ ప్రాంతంలో శ్రీనివాసన్, గంగాదేవిలు నివాసముంటున్నారు. గంగాదేవి వయస్సు 37 సంవత్సరాలు. పిల్లలున్నారు. ఆరు అడుగుల పొడవు, తెల్లగా అందంగా ఉంటుంది గంగాదేవి. భర్త అకౌంటెంట్. బాగా సంపాదిస్తున్నాడు.
 
ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు లేవు. అయితే కరోనా కారణంగా ఇంట్లో ఖాళీగా కూర్చున్న గంగాదేవి ఒంటరిగా ఫీలైంది. తాను బ్యూటీపార్లర్ పెట్టుకుంటానని భర్తను కోరింది. భార్య అడగ్గానే బ్యూటీపార్లర్ పెట్టించాడు భర్త శ్రీనివాసన్. అదే వారి జీవితాన్ని నాశనం చేస్తుందని ఊహించలేకపోయారు.
 
బ్యూటీపార్లర్ జరగకపోగా అక్కడ ఖాళీగా ఉన్న గంగాదేవి ఫేస్ బుక్‌కు బాగా కనెక్టయ్యింది. అందులో మధురై జిల్లా కామరాజ్ నగర్‌కు చెందిన ముత్తుపాండి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ముత్తుపాండి భార్య అతనితో గొడవపడి చెన్నై వెళ్ళిపోయింది. దీంతో అతను ఒంటరిగా ఫీలయ్యాడు.
 
ఇద్దరి ఒంటరిగా ఫీలవుతూ చివరకు ఒక్కటయ్యారు. బ్యూటీపార్లర్‌నే ఏకంగా శృంగార గదిగా మార్చేసి ప్రియుడితో ఎంజాయ్ చేసేది గంగాదేవి. భర్తకు విషయం చెప్పలేదు. అయితే సరిగ్గా మూడురోజుల క్రితం ప్రియుడితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి ఒక ప్లాన్ చేసింది.
 
తన దగ్గరున్న విలువైన బంగారం, డబ్బులను తీసుకుని వెళ్ళిపోయేందుకు ఇంట్లో దొంగతనం చేయాలనుకుంది. ఆ విషయాన్ని భర్తకు మరుసటిరోజు నిజంగనే దొంగలు పడ్డారని నమ్మించి వెళ్ళిపోదామని ఇద్దరూ కలిసి స్కెచ్ వేశారు. అనుకున్న విధంగా దొంగతనం నాటకం ఆడారు. అయితే భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం గంగాదేవిని విచారించడంతో సమాధానం చెప్పలేక ఆమె ఇబ్బంది పడింది.
 
అసలు విషయం తెలిస్తే భర్త ఏమంటాడో అన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల విచారణలో ప్రియుడి బాగోతం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.