పెళ్లైన మహిళ మెడలో తాళి కట్టాడు.. నుదుట బొట్టు పెట్టాడు.. ఇదంతా రైలు టాయ్‌లెట్ పక్కనే..?

Bihar Man
సెల్వి| Last Updated: శుక్రవారం, 11 జూన్ 2021 (10:44 IST)
Man
ప్రేమ కోసం ఓ మహిళకు పెళ్లైనా పర్లేదని.. ఆ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా రైలులోనే ఆ వ్యక్తి పెళ్లయిన మహిళ మెడలో తాళి కట్టాడు. అది కూడా ట్రైన్‌లో కావడంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. బీహార్ సుల్తాన్‌గంజ్‌లోని భీర్ ఖుర్ద్ గ్రామానికి చెందిన అషు కుమార్ అనే వ్యక్తి అను కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

అను కుమారికి రెండు నెలల క్రితమే ఆమె కుటుంబం బలవంతంగా పెళ్లి చేసింది. అయితే ఇష్టం లేకుండా బలవంతంగా చేసిన పెళ్లి కావడంతో.. ఆమె తన భర్తను అంగీకరించలేకపోయింది. ఆమె అషు కుమార్‌తో కొన్నేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉండటంతో.. ఆమె భర్తతో సంతోషంగా గడపలేకపోయింది. అను కుమారి మాట్లాడుతూ.. 'నా ప్రేమ వ్యవహరం గురించి తెలిసిన కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అలాగే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే నిర్భంధించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాకు బలవంతంగా కిరణ్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే నేను భర్తను తిరస్కరించాను'అని తెలిపారు.

ఇక, భర్తతో కలిసి జీవించడానికి అను ఇష్టపడలేదు. అయితే ఈ క్రమంలోనే ప్రియుడిని కలిసేందుకు ప్లాన్ చేసింది. బుధవారం తన భర్త ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఆమెకు లభించింది. దీంతో ఆమె ఇంట్లో నుంచి పారిపోయి సుల్తాన్‌గంజ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత వారిద్దరు అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే రైలు ఎక్కారు. ట్రైన్‌లోనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఇందుకు సంబంధించి అషు మీడియాతో మాట్లాడుతూ.. 'ట్రైన్ ఎక్కిన ఆమె మెడలో తాళి కట్టాల్సిందిగా అను ఒత్తిడి తెచ్చింది. దీందో రైలులో టాయిలెట్ ముందు నిలబడి ఆమె నూదుటిపై బొట్టు పెట్టాను. ఆ తర్వాత ఆమె మెడలో తాళి కట్టాను' అని చెప్పాడు. కాగా, వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.దీనిపై మరింత చదవండి :