పెళ్లై నెల రోజులే.. ఇంతలో భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్ మండిలో కాలేరు సతీష్ (33) తన భార్య, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా సతీష్‌కు 10 నెలల క్రిత్రమే వివాహం జరిగింది.
ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే.. గురువారం మధ్యాహ్నం భార్యతో గొడవ పడ్డ సతీష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఘటనా స్థలాన్ని చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఎస్ఐ శ్రీనివాస్ పరిశీలించారు.