బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (19:47 IST)

కాజా టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం.. ఆగివున్న లారీలో...?

గుంటూరు మంగళగిరి మండలంలోని కాజా టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న ఓ లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో టోల్ గేట్ సిబ్బంది పరుగులు తీసి దూరంగా వెళ్లిపోయారు. 
 
అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా అగ్నిప్రమాదం ఘటన వల్ల కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
 
లాక్ డౌన్ అమలులో ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెపుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని లారీలో ఎలాంటి లోడు లేదని మంటలను అదుపులోకి తీసుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం లారీ టైరు పేలటమే అని ప్రాధమికంగా అంచనా వేశారు. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.