ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (10:07 IST)

అప్పులు తీర్చే మార్గం లేక భార్యపై అత్యాచారం చేయించాడు..

కరోనా కాలంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో దారుణం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక భర్త భార్యపై అత్యాచారం చేయించాడు ఓ భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కడలూరుకు చెందిన వ్యక్తి తన స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. ఉపాధి లేక అతను అప్పులు తీర్చలేకపోయాడు. అప్పు తీర్చే మార్గం లేక తన భార్యను వారికి ఎరగా చూపాడు. భార్యను స్పృహ తప్పేలా చేశాడు. 
 
అనంతరం అప్పు ఇచ్చిన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి భర్తతో పాటు అఘాయిత్యం జరిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.