ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (17:09 IST)

"అఖండ"పై శ్రీకాంత్ వ్యాఖ్యలు.. ఏం చెప్పారేంటి?

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంపై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుండి విముక్తి రావాలని స్వామివారిని మొక్కుకున్నానని శ్రీకాంత్ చెప్పారు. ఈ క్రమంలోనే అఖండపై స్పందిస్తూ.. మొదటిసారి బాలకృష్ణకు విలన్‌గా చేస్తున్నానని పేర్కొన్నారు.
 
బాలయ్య నటించిన శ్రీరామరాజ్యంలో రామలక్ష్మణులుగా నటించిన మేము అఖండలో హీరో విలన్లుగా తలపడుతుండడం ఎంతో ఆసక్తిగా ఉందని తెలిపారు శ్రీకాంత్‌. ఇక అఖండతో పాటు కన్నడ చిత్రంలోనూ నటిస్తున్నానని, తెలుగులో మరణమృదంగం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడని చెప్పుకొచ్చారు. 
 
కాగా అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు.