గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated: గురువారం, 24 నవంబరు 2022 (16:05 IST)

దేశంలోనే అతిపెద్ద వెండితెర ఏర్పాటు.. ఎక్కడ?

big screen
దేశంలోనే అతిపెద్ద వెండితెరను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ భారీ స్క్రీన్‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 64 అడుగులు ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో దేశంలోనే అతిపెద్ద వెండితెరగా రికార్డు పుటలకెక్కనుంది. దీన్ని వచ్చే నెల 16వ తేదీన "అవతార్-2" చిత్రం విడుదలయ్యే నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలన్న సంకల్పంతో ఉన్నారు. 
 
కెనడాకు చెందిన స్ట్రాంగ్ సిస్టమ్‌ అనే ప్రొజెక్షన్ స్క్రీన్ల తయారీ కంపెనీ ఈ అతిపెద్ద స్క్రీన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టమ్‌ను కూడా అత్యుత్తమమైనదిగా ఏర్పాటు చేస్తున్నారు. 
 
నిజానికి హైదరాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తు వచ్చేది నెక్లెస్ రోడ్డులో ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స. ఇక్కడ ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఉంది. ఇపుడు కొత్తగా దీనికంటే మరింత పెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.