మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (13:28 IST)

బ్రెస్ట్ కేన్సర్ బారిన పడిన నటి, ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్

Chhavi Mittal
ఫోటో కర్టెసీ-ఫెస్ బుక్
కేన్సర్ మహమ్మారి. ఎందరి జీవితాలనో కబళిస్తుంది. ఐతే త్వరితగతిన దీనిని కనుగొంటే ప్రాణాలను రక్షించుకునే వీలుంటుంది. దీనిపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... బుల్లితెర నటి ఛవి మిట్టల్ తను రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. హిందీ సీరియళ్లలో పాపులర్ స్టార్ అయిన ఛవి... ఈమధ్య వ్యాయమం చేస్తుండగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోగా ఆమె రొమ్ములో కణితి వున్నట్లు వైద్యులు కనుగొన్నారు.

 
దీనిపై ఛవి మిట్టల్ పోస్ట్ పెడుతూ... బ్రెస్ట్ కేన్సర్ అనగానే చాలామంది ఆ సమస్యను చెప్పుకునేందుకు వెనుకాడుతుంటారు. కానీ నేను భయపడను. ఆ రోగంతో పోరాడి జయిస్తాను అంటూ పోస్ట్ చేసింది.