శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (16:09 IST)

భూతద్ధం భాస్కర్‌ నారాయణ టీజర్ నచ్చి వచ్చాను : తేజ సజ్జ

Teja Sajja, Siva Kandukuri, Rashi Singh
Teja Sajja, Siva Kandukuri, Rashi Singh
విభిన్నమైన మంచి చిత్రాల్లో న‌టిస్తూ నటుడుగా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మరో సినిమాను ప్రేక్షకులను అలరించనున్నాడు. శివ కందుకూరి  హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా  "భూతద్ధం భాస్కర్‌ నారాయణ". ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు.
 
ఇదివరకే రిలీజైన మోషన్ పోస్టర్ తో అంచనాలను పెంచింది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో శివ కందుకూరి డిటెక్టీవ్ గా కనిపించనున్నాడు. పోలీస్ లకు చుక్కలు చూపిస్తున్న ఒక సీరియల్ కిల్లర్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ టీజర్ లో శివ కందుకూరి ని గమనించవచ్చు. మంచి కథతో పాటు అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే బాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ ను ప్రెజెంట్ చేసారు మేకర్స్. ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది.
 
ఇదివరకే ఈ చిత్రం గురించి మేకర్స్ ప్రస్తావిస్తూ ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి ఎడ్జ్‌ ఆఫ్‌ద సీట్‌గా వుంటుంది. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్ని ప్రేక్షకులు ముందుగా ఊహించడం చాలా కష్టం’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
హీరో తేజ సజ్జ మాట్లాడుతూ, ఈ సినిమా టీజర్ చూసి నేను ఈ ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమా ప్రొడ్యూసర్స్  స్నేహల్‌,శశిధర్‌, కార్తీక్‌ ఇంకా మీరెన్నో మంచి సినిమాలు చెయ్యాలి. కొత్తవాళ్లు ఎక్కడున్నా రాజ్ కందుకూరి గారు ఎంకరేజ్ చేస్తారు. అలానే ఈ సినిమా చూడండి నచ్చితే ఒక పదిమందికి చెప్పండి.