సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (04:22 IST)

బికినీ పాత్రలా.. నేనా.. నెవ్వర్.. తమన్నా భీషణ ప్రతిజ్ఞ

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మా అమ్మానాన్నలకు కొన్ని ప్రామిస్‌లు చేశా. నాకు కంఫర్ట్‌బుల్‌గా లేని బట్టలను నేను వేసుకోను. అయినా వేసుకునే డ్రెస్సులు మనకు పాపులారిటీ తీసుకురావు. ప్రేక్షకులను ఎట్

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మా అమ్మానాన్నలకు కొన్ని ప్రామిస్‌లు చేశా. నాకు కంఫర్ట్‌బుల్‌గా లేని బట్టలను నేను వేసుకోను. అయినా వేసుకునే డ్రెస్సులు మనకు పాపులారిటీ తీసుకురావు. ప్రేక్షకులను ఎట్రాక్ట్‌ చేయడానికి నేను బికినీ వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేయాలంటే బికినీ వేసుకోవలసిందేనా స్కిన్‌ షో తప్పనిసరా అనడిగితే... ‘‘స్కిన్‌ షోకి ప్రేక్షకులు ఎట్రాక్ట్‌ అవుతారనేది అపోహే. నేను నమ్మను’’ అంటున్నారు తమన్నా.


హీరోయిన్‌గా మీకు మీరు ఏవైనా పరిమితులు పెట్టుకున్నారా అని తమన్నాను ప్రశ్నిస్తే... ‘‘యస్‌. కొన్ని ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మా అమ్మానాన్నలకు కొన్ని ప్రామిస్‌లు చేశా. నాకు కంఫర్ట్‌బుల్‌గా లేని బట్టలను నేను వేసుకోను. అయినా వేసుకునే డ్రెస్సులు మనకు పాపులారిటీ తీసుకురావు. ప్రేక్షకులను ఎట్రాక్ట్‌ చేయడానికి నేను బికినీ వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. నేనెప్పుడూ అలా చేయను’’ అని సమాధానం ఇచ్చారు. 
 
ఈ శుక్రవారం వస్తోన్న ‘బాహుబలి–2’ మినహా... ప్రస్తుతం తమన్నా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో ఓ మూడున్నాయి. హిందీలో ప్రభుదేవాతో కలసి చేస్తున్న సినిమాలో చెవిటి, మూగ అమ్మాయిగా నటిస్తున్నారు. ప్రతి వారం రెండు మూడు సినిమాలు తమన్నా తలుపు తడుతున్నాయట. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయట. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పుకొచ్చారు.