దక్షిణాఫ్రికాలో 100 ఏళ్ల నాటి రైల్వే స్టేషన్‌లో భారతీయుడు
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు-2' నాలుగేళ్లు దాటినా విడుదలకు నోచుకోలేదు. గతంలోసెట్‌లో ప్రమాదం కారణంగా ముగ్గురు చనిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఆ సమస్యలన్నింటినీ అధిగమించి ఇప్పుడు శంకర్ ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభమైంది.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సౌతాఫ్రికా, తైవాన్‌లలో జరిగింది. ఈ సందర్భంలో దర్శకుడు శంకర్ దక్షిణాఫ్రికాలోని 100 ఏళ్ల నాటి రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది