మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (13:24 IST)

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

jani master
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బోరున విలపించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శృష్టి తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. 
 
దీంతో ఆయన గత కొంతకాలంగా కొరియోగ్రఫీకి దూరంగా ఉన్నారు. ఇపుడు చాలాకాలం తర్వాత ఓ మూవీ సెట్లోకి అడుగుపెట్టారు. బెంగళూరులో జరుగుతున్న ఓ మూవీ షూటింగ్ స్పాట్ వద్దకు వెళ్లిన ఆయనకు చిత్రబృందం తొలుత గుమ్మడి కాయతో దిష్టి తీయించింది. అనంతరం కేక్ కట్ చేయించి వెల్కమ్ చెప్పింది. వారు చూపిన ప్రేమకు ఆయన సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు.