ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (13:26 IST)

జూనియర్ ఎన్టీఆర్ షార్ట్ ఫిలిమ్.. అమ్మాయిలూ.. జాగ్రత్త (వీడియో)

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్.. మహిళల భద్రతపై షార్ట్ వీడియో ద్వారా అప్రమత్తం చేశారు. సినీ హీరోగా యువతకు దగ్గరైన యంగ్ టైగర్... బిగ్ బాస్ తొలి సీజన్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్.. మహిళల భద్రతపై షార్ట్ వీడియో ద్వారా అప్రమత్తం చేశారు. సినీ హీరోగా యువతకు దగ్గరైన యంగ్ టైగర్... బిగ్ బాస్ తొలి సీజన్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా వున్న ఎన్టీఆర్.. సైబర్ క్రైమ్స్ పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని.. ఎవరికి ఫిర్యాదు చేయాలో వెల్లడించారు. 
 
గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ఆన్‌లైన్ పరిచయం మంచిది కాదని ఎన్టీఆర్ తెలిపారు. ఈ మేరకు యువతలో చైతన్యాన్ని పెంచేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హీరో ఎన్టీఆర్‌తో ఓ షార్ట్ ఫిలిమ్‌ని తీసి విడుదల చేశారు. ఈ షార్ట్ ఫిలిమ్ ప్రముఖ థియేటర్లలో సోమవారం నుంచి ప్రదర్శితమవుతోంది. అదే వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదల చేశారు.
 
ఈ వీడియోలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ఓ యువతికి ఎదురైన చేదు అనుభవాన్ని చూపించారు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయకండంటూ అప్రమత్తం చేశారు.