జూనియర్ ఎన్టీఆర్ కొత్త అవతారం..(video)
జూనియర్ ఎన్టీఆర్ కొత్త అవతారం ఎత్తనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలో ఆయన హీరోగా నటిస్తాడు అనుకుంటే.. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రోల్ విలన్ అని తెలిసింది. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో మాత్రమే కాదు .. విలన్ కూడా అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట. గతంలో "జై లవ కుశ" సినిమాలో ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్‌తో కనిపించిన ఎన్టీఆర్, ఈ సారి పూర్తి స్థాయిలో విలనిజాన్ని చూపించనున్నాడని అంటున్నారు. దీనిపై ఆ సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.