శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (14:31 IST)

ఆ డైలాగ్ అంతలా పేలుతుందని ఊహించలేదు : చిరంజీవి

chiru - sri mukhi
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "గాడ్ ఫాదర్". వచ్చే నెల ఐదో తేదీన విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇందులోభాగంగా, ఓ ప్రైవేట్ జెట్‌లో చిరంజీవిని శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి తనదైనశైలిలో సమాధానిమిచ్చారు. 
 
ఈ చిత్రానికి సంబంధించి తాజా ఓ టీజర్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో "రాజకీయాలకు నేను దురమయ్యానుగానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు" అంటూ నేను చెప్పిన డైలాగుకి అనూహ్యమైన స్పందన వచ్చింది. నిజంగా ఈ డైలాగ్ ఈ స్థాయిలో పేలుతుందని నేను అనుకోలేదన్నారు. 
 
నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు. కానీ సినిమా చూసే ప్రేక్షకుడికి అవి లేవనే తలంపు రవ్వంత కూడా కలగదన్నారు. ఇకపోతే, కొత్తగా నన్ను నేను ఆవిష్కరించుకోవడం కోసమే నేను 'లూసిఫర్' రీమేక్‌ను ఎంచుకున్నాను. జీవితాన్ని కాచి ఒడబోశాడు అనేట్టుగా కనిపించాలనే ఉద్దేశంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ను ఎంచుకున్నాను. లుక్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఊహ .. అంచనా తప్పలేదని అనిపించింది. ఈ సినిమాలో నాపై గల ప్రేమతో సల్మాన్ చేశాడు. అందుకు ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. మా ఇద్దరి మధ్య సాంగ్‌ను ప్రభుదేవా గొప్పగా కంపోజ్ చేశాడు. 
 
సత్యప్రియ పాత్రలో నయనతార అద్భుతంగా ఒదిగిపోయింది. ఆమె గ్లామర్ .. యాక్టింగ్ ఈ సినిమాకి బాగా సపోర్టు చేశాయి. ఇక సత్యదేవ్‌ను ఆ పాత్రకి నేనే సిఫార్స్ చేశాను. ప్రతినాయకుడి తరహాలో సాగే ఆ పాత్రలో అతను గొప్పగా చేశాడు. ఇక ఒక ప్రత్యేకమైన పాత్రలో పూరి కనిపిస్తాడు. కారవాన్ నుంచి షాట్‌కి రావడానికి కాస్త నెర్వస్ ఫీలయ్యాడు గానీ .. ఆ తర్వాత చాలా బాగా చేశాడు' అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.