గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (15:16 IST)

చిరంజీవి "గాడ్‌ఫాదర్" ప్రిరిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్

godfather
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్‌ ఫాదర్. మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక. అక్టోబరు ఐదో తేదీన దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. ఇందులో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించాడు. 
 
తొలిసారి నెరిసిన గడ్డంతో తన వయసుకు తగ్గ పాత్రలో నటించాడు. అంతేకాదు ఈ చిత్రంలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్‌ కూడా కీలక పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోస్టర్స్, టీజర్‌కు అద్బుత స్పందన వచ్చింది. 
 
మరోవైపు చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో "గాడ్ ఫాదర్" మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ప్రకటించింది. ఈ నెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించింది. అయితే, హైదరాబాద్ బదులు అనంతపురంను వేదికగా ఎంచుకుని ఆశ్చర్య పరిచింది. 
 
వచ్చే బుధవారం నగరంలోని ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.