బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:39 IST)

ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పోటీ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అవుననే సమాధానం చెబుతున్నారు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగే దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‍లో "అరవింద

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అవుననే సమాధానం చెబుతున్నారు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగే దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‍లో "అరవింద సమేత వీరరాఘవ" చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది.
 
ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో భారీ పొలిటికల్ ఎపిసోడ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ ఎన్నికల బరిలో కూడా నిలుపుతారనే ప్రచారం జరుగుతోంది. 
 
ఎన్టీఆర్ హావభావాలు, ఎన్నికల ప్రసంగాలను అధ్యయనం చేసిన త్రివిక్రమ్ భారీ పొలిటికల్ ఎపిసోడ్ కూడా పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఓవైపు సినిమా షూటింగ్ నిర్వహిస్తూనే మరోవైపు నిర్మాణాంతర పనులపై దృష్టి పెట్టింది చిత్రబృందం.