సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (12:56 IST)

ఈ స్టోరీ నాకంటే ఎన్టీఆర్‌కు బాగా సూటవుతుంది : పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసిన సినిమా స్టోరీ ఒకటి ఇపుడు హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సూటయ్యింది. ఫలితంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసిన సినిమా స్టోరీ ఒకటి ఇపుడు హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సూటయ్యింది. ఫలితంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. 
 
సాధారణంగా స్టోరీ రైటర్ లేదా డైరెక్టర్ ఓ కథ రెడీ చేసుకునేటప్పుడు ఫలానా హీరో చేస్తే బాగుంటుందనుకుని తయారు చేస్తారు. స్టార్ హీరోస్‌కి సబ్జెక్ట్స్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ హీరోనే చేయాలని భావిస్తారు. డైరెక్టర్ తన స్టోరీని ఆ హీరోకు వినిపించడం కూడా అదే ఉద్దేశంతో చెబుతాడు. 
 
అయితే, రైటర్ కానీ, డైరెక్టర్ కానీ ఒక హీరో కోసం సిద్ధం చేసుకున్న కథ తప్పనిసరిగా అతనికి నచ్చాలని రూలేం లేదని తాజాగా జరిగిన సంఘటన ద్వారా వెల్లడైంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ సిద్ధం చేసుకుని ఆయనకు వినిపించాడట. 
 
కథ పూర్తిగా విన్న తర్వాత అది చాలా బాగుందని, ఇది నా కన్నా ఎన్టీఆర్ చేస్తేనే బాగుంటుందని పవన్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ కుదిరిందని ఫిలింనగర్ టాక్. ఓ స్టార్ హీరోకు కథ నచ్చిన తర్వాత, తనకన్నా మరో హీరోకు నప్పుతుందని సలహా ఇవ్వడం ఇండస్ట్రీలో ఉన్న మంచి వాతావరణానికి నిదర్శనమని పలువురు చెబుతున్నారు.