మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (12:22 IST)

సినీ ఇండస్ట్రీకి ఏమైంది..? ప్రేమ విఫలం.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

సినీ ఇండస్ట్రీని విషాధాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కరోనా సెలెబ్రిటీలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే లెజెండ్రీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం దివికేగిన విషయం తెలిసిందే.

సెలెబ్రిటీలు కరోనా సోకడం హోమ్ క్వారంటైన్‌లో వుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జూనియర్‌ ఆర్టిస్టుగా పని చేస్తున్న నమో కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
కిరణ్ ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణమని తెలుస్తుంది. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తుంది.