ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:33 IST)

చనిపోవాల్సింది... దేవుడుదయతో ప్రాణాలతో ఉన్నా.. కాజల్ అగర్వాల్

తాను చనిపోవాల్సిందని, కానీ, దేవుడు దయతో ప్రాణాలతో ఉన్నట్టు ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ అన్నారు. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు-2 చిత్రం షూటింగ్‌లో బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ చిత్రం షూటింగ్‌ సెట్‌లో భారీ క్రేన్ ఒకటి విరిగి... ఓ టెంట్‌పై పడింది. ఈ ప్రమాదంలో దర్శకుడు శంకర్ అసిస్టెంట్లు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి దర్శకుడుతో పాటు.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
దీనిపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. సినీ బృందంలోని మధు (29), చంద్రన్ (60)తో పాటు సహాయ దర్శకుడు కృష్ణ (34) మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి జరిగిన క్రేన్ ప్రమాదంపై నేనింకా షాక్‌లోనే ఉన్నాను. త్రుటిలో నేను ప్రమాదం నుంచి తప్పించుకుని ఈ రోజు ట్వీట్ చేస్తున్నాను. ఆ క్షణాన నాకు కాలం, జీవిత విలువ తెలిసింది' అని తెలిపింది. 
 
ఇదిలావుంటే, చెన్నై నగర శివారు ప్రాంతంలో ఉన్న ఈవీపీ స్టూడియోలో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలిని పరిశీలించారు. క్రేన్ ఆపరేటర్‌ రాజన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.