గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (11:54 IST)

భర్తకు లిప్ లాక్ ఇచ్చిన చందమామ

Kajal
Kajal
టాలీవుడ్ చందమామ ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ సినిమాల వైపు దృష్టి సారిస్తోంది. బాబు పుట్టిన తర్వాత ఆమె మళ్లీ స్టార్‌డమ్‌ను నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 
 
దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ 2020 కరోనా కాలంలో తన చిన్ననాటి స్నేహితుడు ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లికి తర్వాత తల్లి కావడం.. మగబిడ్డకు జన్మ ఇవ్వడంతో.. నటనకు కాస్త బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.  
 
తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఈ అమ్మడు రొమాంటిక్ పిక్ షేర్ చేసింది. ఈ పిక్‌లో గౌతమ్ కిచ్లూ నీల్ కిచ్లూను ఎత్తుకుని వుండగా.. కాజల్ భర్తకు లిప్ లాక్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. కాజల్ అగర్వాల్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఇండియన్ 2లో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి.