ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (22:19 IST)

పక్కా ప్లాన్‌.. భర్తను చంపిన భార్య.. కారణం అదే..?

వివాహేతర సంబంధాలతో నేరాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు కనుమరుగు అవుతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం భార్యను భర్త, భర్తను భార్య చంపేసుకునే కాలం వచ్చేసింది. అందుకు ఈ ఘటన కూడా ఓ ఉదాహరణ.
 
వివరాల్లోకి వెళితే.. పరాయి మహిళలతో కలిసి వున్న వీడియోలతో భార్యను చిత్ర హింసలకు గురిచేసిన భర్తను పక్కా ప్లాన్ ప్రకారం భార్య చంపేసింది. భర్త రెండో పెళ్లి చేసుకున్నా సహించింది. కానీ అతని వేధింపులు ఆగకపోవడంతో భర్తను భార్య హతమార్చిన ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
భర్త వేణుకుమార్‌ను తన బంధువుతో కలిసి భార్య సుస్మిత హతమార్చింది. ఆపై ఏమీ తెలియనట్లు  పోలీస్ స్టేషన్ కంప్లెంట్ ఇచ్చింది. రెండు రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చేది. అయితే పోలీసులకు భార్యపై అనుమానం వచ్చింది. ఆమె కాల్ డేటా ఆధారంగా ఆమే నిందితురాలని పోలీసులు గుర్తించారు. 
 
మొబైల్‌ సిగ్నల్స్‌, కాల్‌ డేటా ఆధారంగా 71 రోజుల తర్వాత హత్య కేసును పోలీసు ఛేదించారు. నిద్రమాత్రలు ఇచ్చి అతనని తన బంధువు రత్నాకర్‌చే నదిలో పడేసేలా చేసింది.  ఈ ఘటనలో మృతుడి భార్యను, రత్నాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.