శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (11:38 IST)

ఆ వీడియోలు చూపించి వేధిస్తున్న భర్తను కడతేర్చిన భార్య.. ఎక్కడ?

sushmitha
పరాయి స్త్రీలతో తాను ఏకంగా గడిపిన వీడియోలు చూపించి వేధిస్తున్న భర్తను ఓ భార్య చంపేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖాజీపేటలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... పాలమూరు జిల్లా జన్నారపు వేణుకుమార్ అనే వ్యక్తి చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తుండగా, భార్య సుస్మిత రైల్వే లోకోషెడ్‌లో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాజీపేట రైల్వే కాలనీలో నివాసం ఉంటున్నారు. 
 
అయితే, వేణుకుమార్‌కు మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ తొలి భార్య సుస్మిత సర్దుకునిపోయింది. అంతటితో ఆగని వేణుకుమార్.. మరికొందరు అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు తీసి వాటిని సుస్మితకు చూపించసాగాడు. దీంతో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అయినప్పటికీ భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఆయన్ను లేకుండా చేయాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం తన బంధువు కొంగర అనిల్‌ను సంప్రదించింది. 
 
అనిల్ ఓ హత్య కేసులో నిందితుడైన జయశంకర్ జిల్లా మొగళ్ళపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్‌ను సంప్రదించాడు. వేణుకుమార్‌ను హతమార్చడానికి రూ.4 లక్షల సుపారీ కుదుర్చుకుని ముందుగా రూ.2 లక్షలు చెల్లించారు. 
 
తమ పథకంలో భాగంగా, గత సెప్టెంబరు 30వ తేదీన సుస్మిత పాలలో నిద్రమాత్రలు కలిపి భర్త వేణుగోపాల్‌కు ఇవ్వగా, వాటిని తాగిన ఆయన గాఢనిద్రలోకి జారుకున్నారు. ఆ ర్వాత రత్నాకర్ వచ్చి వేణుగోపాల్‌ను కారులో వెనుక సీట్లో కూర్చోబెట్టుకుని పెద్దపల్లి జిల్లా మంథనికి బయలుదేరగా, మార్గంమధ్యలో పరకాల వద్ద కటిన నవీన్‌ను కారులో ఎక్కించుకుని హత్య చేశారు. కారు మంథని చేరుకున్న తర్వాత వేణుగోపాల్ దుస్తులన్నీ విప్పేసి మానేరు వాగుల పడేశారు. ఈయన మృతదేహం లభించడంతో మంథని పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. 
 
అదేసమయంలో తన భర్త కనిపించడం లేదంటూ సుస్మిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో సుస్మితను అనుమానించి ఆమె మొబైల్ కాల్ లాగ్‌ను పరిశీలించగా, రౌడీషీటర్ గడ్డం రత్నాకర్‌తో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. బ్లూఫిల్మ్ వీడియోలు చూపించడం వేధించడం వల్లే తన భర్తను కిరాయి మూకలతో హతమార్చినట్టు సుస్మిత అంగీకరించింది. దీంతో ఈ హత్యకు సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.