భార్యను హత్యచేసి 50 ముక్కలుగా నరికాడు.. ఎందుకంటే?
జార్ఖండ్ రాష్ట్రంలో తన భార్యను ఓ భర్త హత్య చేసి 50 ముక్కలుగా నరికిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. దిల్సర్ అన్సారీ జార్ఖండ్‌లోని సకీబ్‌గంజ్ జిల్లాలోని బోరియో నివాసి. అతనికి అప్పటికే వివాహమై, ఆ ప్రాంతానికి చెందిన రూబికా బగాదిన్ అనే 22 ఏళ్ల గిరిజన యువతితో వివాహేతర సంబంధం ఉంది.
రెండేళ్లుగా ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. ఈ కేసులో రూబికా కనిపించడం లేదని దిల్సర్ అన్సారీ ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూబికా తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అన్సారీపై వారికి అనుమానం కలిగింది.
ఇదిలా వుంటే సంతాలి గ్రామంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలో కుక్క మానవ శరీర భాగాన్ని తినేస్తున్నట్లు స్థానికులు చూశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఆ భవనంలో 12 శరీర భాగాలు కనిపించాయి. విచారణలో అది రూబికా శరీర భాగాలని తేలింది.
దీంతో అన్సారీపై అనుమానం వచ్చి పోలీసులు తీవ్రంగా విచారించగా.. రూబికాను హత్య చేసి 50 ముక్కలుగా నరికి తానేనని అన్సారీ అంగీకరించాడు. అన్సారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.