గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2022 (09:38 IST)

తన విషయాల్లో జోక్యం చేసుకుంటుందనీ మేనత్తను చంపి ముక్కలు చేశాడు..

murder
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటుందన్న కోపంతో ఓ యువకుతు తన మేనత్తను చంపి మృతదేహాన్ని పది ముక్కలు చేశాడు. ఒక్కో ముక్కను ఒక్కో ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. అయితే, మేనత్త మృతదేహాన్ని ముక్కలు చేసే సమయంలో కిందపడిన రక్తాన్ని శుభ్రం చేస్తుండగా మృతురాలి కుమార్తె చూడటంతో ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 
 
జైపూర్‌కు చెందిన సరోజ్ శర్మ (64) అనే మహి భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయినప్పటి నుంచి ఈమె బాగోగులను అనుజ్ శర్మ అనే వ్యక్తి చూస్తున్నాడు. సరోజ్ శర్మ ఈయనకు మేనత్తవరుస అవుతుంది. అయితే, అనుజ్ శర్మ వ్యక్తిగత విషయాల్లో మేనత్త జోక్యం చేసుకునేది. ఈ జోక్యం మితిమీరిపోవడంతో అనుజ్ శర్మ భరించలేకపోయాడు. ఈ నెల 11వ తేదీన అనుజ్ ఢిల్లీ వెళ్ళాల్సి ఉండగా, అందుకు ఆమె సమ్మతించలేదు. 
 
దీంతో కోపోద్రిక్తుడైన అనుజ్.. మేనత్తను సుత్తితో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని మార్పుల్ కటింగ్ యంత్రంతో 10 ముక్కలు చేశాడు. వాటిని అడవిలో వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. పైగా, తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా మేనత్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అనుజ్ కిచెన్‌లో రక్తపు మరకలను నీటితో శుభ్రం చేస్తూ సరోజ్ కుమార్తె కంటపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.