గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (14:40 IST)

తప్పతాగి ఇంటికి వస్తే ఎలా? భర్తను హత్య చేసి రాత్రంతా శవంతోనే..?

crime scene
యూపీలోని రాయ్‌బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసి రాత్రంతా శవంతోనే నిద్రించింది. ఉదయం నిద్రలేచిన తర్వాత పిల్లలు అతన్ని లేపాలని ప్రయత్నించినా.. పిల్లలను లేపొద్దని వారించింది. ఆపై బ్యూటీపార్లర్ కు వెళ్లింది. 
 
వివరాల్లోకి వెళితే.. అతుల్, అన్నూ ఇద్దరు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్నూ ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేసేది. ఇంటికి వచ్చి కుటుంబాన్ని చూసుకునేది. ఇక అతుల్ పనిచేసినా ఆ కష్టమంతా మద్యానికే దారపోసేవాడు. ఇంట్లో తన భార్యతో ఘర్షణకు దిగేవాడు. డిసెంబర్ 15న అతుల్ మద్యం సేవించి అర్థరాత్రి వచ్చి అన్నును కొట్టాడు. 
 
భరించలేకపోయిన అన్నూ.. ఇంట్లోని ఓ కర్రతో అతుల్ తలపై కొట్టింది. దాంతో స్పృహ కోల్పోయాక.. అతని గొంతు నులిమి చంపేసింది. రాత్రంతా శవం వద్దే నిద్రపోయింది. తర్వాత మద్యం సేవించి కిందపడి చనిపోయాడంటూ సీన్ క్రియేట్ చేసింది. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అన్నూ నిజాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.