బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (17:06 IST)

దొంగల్లా అర్థరాత్రి తొలగిస్తారా? ఆయనకు మీరిచ్చే గౌరవం ఇదేనా?: కమల్ ఫైర్

తమిళుల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న మహా నటుడు శివాజీ గణేశన్ విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా, అర్థరాత్రి పూట తొలగించడాన్ని సినీనటుడు కమల్ హాసన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి తమిళుడి హదయంలో చెరగని ము

తమిళుల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న మహా నటుడు శివాజీ గణేశన్ విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా, అర్థరాత్రి పూట తొలగించడాన్ని సినీనటుడు కమల్ హాసన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి తమిళుడి హదయంలో చెరగని ముద్ర వేసుకునివున్న శివాజీకి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీశారు. 
 
స్థానిక మెరీనా బీచ్‌లోని కామరాజర్ రహదారి మధ్యలో శివాజీ గణేషన్ విగ్రహాన్ని ప్రతిష్టించగా, ఈ విగ్రహం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉందంటూ ఓ గాంధేయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశించింది. 
 
అయితే, ఈ విగ్రహాన్ని అర్థరాత్రి పూట, చడీచప్పుడు లేకుండా ప్రభుత్వం తొలగించి, అడయారు వద్ద నిర్మిస్తున్న శివాజీ స్మారక మందిరంలో ప్రతిష్టించనుంది. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. తమిళుల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న మహా నటుడి విగ్రహాన్ని తొలగించి, ఆయనుకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించాడు కమల్. త్వరలో ఆయన మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి జీవితాంతం కాపాడుకుందాం అని అన్నాడు లోకనాయకుడు.
 
కాగా, గత కొన్ని రోజులుగా తాను ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తమిళ రియాల్టీ షోను వేదికగా చేసుకుని రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. అంగన్ వాడీ కేంద్రాలలో కుళ్ళిపోయిన గుడ్లు పెడుతున్నారని ట్వీట్ చేసిన కమల్ ఆ తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని దుయ్యబట్టాడు. ఆ తర్వాత డెంగ్యూనీ నిర్మూలించకపోతే పదవుల నుండి తప్పుకోవాలని సవాల్ విసిరాడు. ఇపుడు శివాజీ విగ్రహం తొలగింపును ఆయన తప్పుబట్టారు.