సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (15:15 IST)

All eyes on Rafah గ్యాంగ్‌.. ఇది మీకు మీ పిల్లలకు కూడా జరగొచ్చు : కంగనా

Kangana Ranaut
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. తనపై చండీగఢ్‌ విమానాశ్రయంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన కలకలం సృష్టించింది. విజయోత్సాహంలో ఉన్న ఆమెకు ఈ అనూహ్య పరిణామం షాకిచ్చింది. దీనిపై ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ఆ తర్వాత త పోస్టులో కొంతభాగాన్ని తొలగించారు. 
 
'All eyes on Rafah గ్యాంగ్‌.. ఇది మీకు మీ పిల్లలకు కూడా జరగొచ్చు. ఒకరిపై జరిగిన దాడిని మీరు వేడుక చేసుకుంటే.. అదే ఘటన మీకూ ఎదురుకావొచ్చు. అలాంటి పరిస్థితికి సిద్ధంగా ఉండండి' అని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. 'నామీద ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై మీరు మౌనంగా ఉండొచ్చు లేక వేడుక చేసుకుంటూ ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు మనదేశంలో అయినా, విదేశాల్లో అయిన అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. ఇజ్రాయెల్‌ లేక పాలస్తీనాకు చెందినవారు మీపై లేక మీ పిల్లలపై దాడికి పాల్పడొచ్చు. ఇజ్రాయెల్ బందీల కోసమో లేక రఫా కోసం మీ అభిప్రాయం చెప్పినందుకు అలా జరగొచ్చు. అప్పుడు మీ వాక్‌స్వాతంత్ర్యం హక్కుల కోసం నేను పోరాడుతున్నానని గుర్తిస్తారు. నేను అలాచేస్తున్నందుకు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను మీలాగా కాదు కదా' అని వ్యాఖ్యానించారు. తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశారు. \\
 
మృగశిర కార్తె ప్రారంభం... నాంపల్లిలో చేప మందు పంపిణీ!! 
 
మృగశిర కార్తె శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. దీంతో హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగగ్రస్తులకు బత్తిన సోదరులు చేప మందును పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శని, ఆదివారాల్లో సాగే ఈ చేప మందు పంపిణీలో అనేక వేల మంది వచ్చి చేప మందును స్వీకరించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలు సమకూరుస్తుండగా, దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ కూడా అదనంగా 130 ఆర్టీసీ బస్సులను నడిపేలా చర్యలు చేపట్టింది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు బస్సులు నడుపుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, దిల్‌సుఖ్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్ర నగర్, రిసాల బజార్, పటాన్ చెరు జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేశారు.