శనివారం, 14 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (23:02 IST)

కంగనా చెంప చెల్లుమనిపించిన ఎయిర్‌పోర్ట్ మహిళా కానిస్టేబుల్.. ఎందుకు?

Kangana Ranaut
సినీ నటి కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మహిళా కానిస్టేబుల్ తనను చెంపదెబ్బ కొట్టిందని బాలీవుడ్ నటి, కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు. ఎన్‌డిఎ ఎంపీల సమావేశానికి హాజరయ్యేందుకు రనౌత్ ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో విమానాశ్రయంలోని సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. 
 
కుల్విందర్ కౌర్‌గా గుర్తించబడిన కానిస్టేబుల్, సాధారణ తనిఖీ ప్రక్రియలో రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టినట్లు తెలిసింది. ఇటీవల రైతుల ఆందోళన సందర్భంగా పంజాబ్‌కు చెందిన మహిళలపై రనౌత్ అగౌరవంగా వ్యాఖ్యలు చేశారని కౌర్ విచారణలో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలపై ఇంకా క్లారిటీ వివరాలు వెలుగులోకి రాలేదు.  
 
కంగనా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధికారికంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా పంచుకుంది, దాడిపై తాను షాక్, నిరాశను వ్యక్తం చేసింది. అయినప్పటికీ, "నేను క్షేమంగా ఉన్నాను" అని కంగనా వెల్లడించింది.