శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (12:10 IST)

కన్నడ నటుడు 'దునియా' విజయ్ ఇంట విషాదం

ప్రముఖ కన్నడ నటుడు, దునియా స్టార్ హీరో విజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రుద్రప్ప (81) శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన బెంగుళూరులో మృతి చెందారు. కాగా, ఈ హీరో తల్లి కూడా ఇటీవల మరణించిన విషయం తెల్సిందే. 
 
ఇటీవల అనారోగ్యానికి గురైన హీరో తండ్రి రుద్రప్పను బెంగుళూరు ఆస్పత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, వయోవృద్ధుడు కావడంతో ఆయన కోలుకోలేక చనిపోయారు. కాగా, కన్నడ చిత్రపరిశ్రమలో విలన్ పాత్రలకు విజయ్ బాగా ప్రసిద్ధి. అనేక చిత్రాల్లో ఆయన విలన్ పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.