గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (14:26 IST)

బాలయ్య నెక్ట్స్ మూవీ లాంఛ్

గాడ్ ఫాదర్ అనే సినిమా అల్రెడీ సెట్స్ పై ఉంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతోంది. మరి బాలకృష్ణ హీరోగా గాడ్ ఫాదర్ సినిమా ఏంటి? ఇది చిరంజీవి గాడ్ ఫాదర్ కాదు, క్లాసిక్ మూవీ గాడ్ ఫాదర్ ముచ్చట. 1972లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ గాడ్ ఫాదర్ సినిమాను బాలయ్య చేస్తే చూడాలని ఉందని ప్రకటించాడు నాని.
 
ఆహాకు ఓ టాక్ షో చేస్తున్నాడు బాలయ్య. దీనికి గెస్ట్ గా హాజరయ్యాడు నాని. ఈ సందర్భంగా బాలయ్యతో కలిసి సినిమా చేస్తే, ఆ సినిమా ఎలా ఉండాలనే విషయాన్ని బయటపెట్టాడు. “గాడ్ ఫాదర్” లాంటి సినిమా తెలుగులో వస్తే అందులో బ్రాండోగా బాలయ్య నటిస్తే, తను అల్-పాచినో పాత్ర పోషిస్తానని ప్రకటించాడు.
 
కథ బాగుంటే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నాని ఎప్పుడూ సిద్ధమే. అది విలన్ రోల్ అయినా కూడా. “V”, “దేవదాస్” లాంటి సినిమాల్లో నాని నటించాడు. అటు బాలయ్య కూడా కథ బాగుంటే ఏ పాత్ర చేయడానికైనా రెడీ అని ఎప్పుడో ప్రకటించారు. సో,…”గాడ్ ఫాదర్” లాంటి సబ్జెక్ట్ దొరికితే నాని-బాలయ్యను కలపడం పెద్ద కష్టమేం కాదన్నమాట.