సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (17:40 IST)

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

pavitra jayaram
బుల్లితెర నటి పవిత్ర జయరాం దుర్మరణం పాలయ్యారు. త్రినయని సీరియల్‌లో 'తిలోత్తమ'గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె ప్రయాణిస్తున్న కారు.. 44వ జాతీయ రహదారిపై భూత్‌పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను గుద్ది.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. 
 
దీంతో ఈ కారులో ప్రయాణిస్తూ వచ్చిన పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్‌లు గాయపడ్డారు. వీరిలో పవిత్ర మృతి చెందారు. మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, పవిత్ర జయరామ్ కర్ణాటకకు చెందిన నటి. ఆమె టీవీ సీరియల్ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పవిత్ర మృతితో తెలుగు, కన్నడ టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. జీ తెలుగు చానల్‌లో ప్రసారమయ్యే 'త్రినయని' సీరియల్‌లో పవిత్ర 'తిలోత్తమ' అనే నెగెటివ్ రోల్ పోషిస్తున్నప్పటికీ, ఆమెకు ఈ పాత్ర ద్వారా ఎంతోమంది అభిమానులయ్యారు.