ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 10 మే 2024 (19:31 IST)

వ్యవసాయ విద్యలో బాలికలకు సాధికారత: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ రూ. 33 లక్షల స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌

Scholarship Program
సుప్రసిద్ధ అగ్రోకెమికల్ సంస్థ అయిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, వ్యవసాయ విద్యాభివృద్ధికి, మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తన నిబద్ధతను ప్రకటించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (NAAS) సహకారంతో, ఈ బ్రాండ్ వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రెసివ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అంకుర్ అగర్వాల్ యొక్క దివంగత తల్లి శ్రీమతి కనక్ అగర్వాల్ గౌరవార్థం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. 
 
ఈ ప్రత్యేక కార్యక్రమం వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురావాలనే మక్కువతో ఉన్న యువతులకు ఆర్థిక సహాయం, అవకాశాలను అందించడం ద్వారా తదుపరి తరం విద్యార్థుల ఆకాంక్షలను తీర్చనుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ సంవత్సరానికి 21 మంది బాలికల చొప్పున ప్రతి సంవత్సరం మొత్తం 84 స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.
 
"క్రిస్టల్ క్రాప్‌ వద్ద మేము భారతదేశ వ్యవసాయరంగంలో మహిళలు పోషించే కీలక పాత్రను మేము ఎంతో గౌరవిస్తాము. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమ ప్రారంభంతో, బాలికల విద్య కోసం నిష్కపటంగా ప్రయత్నించిన మా తల్లికి మేము నివాళులర్పిస్తున్నాము. ఈ వర్ధమాన ప్రతిభావంతులను అవసరమైన మద్దతు అందించటం ద్వారా వారు విద్యాపరంగా రాణించడమే కాకుండా కెరీర్‌ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా కూడా ముందుకు సాగాలని మేము భావిస్తున్నాము" అని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అంకుర్ అగర్వాల్ అన్నారు.
 
ఈ కార్యక్రమం జూలై/ఆగస్టు, 2024లో జరగబోయే సెషన్ నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారులు మరింత సమాచారాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ & క్రిస్టల్ క్రాప్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. “ఈ ఉదాత్తమైన కార్యక్రమం ద్వారా, మేము విద్యార్థుల భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడమే కాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాము." అని డాక్టర్ హిమాన్షు పాఠక్, సెక్రటరీ, డేర్ & డైరెక్టర్ జనరల్, ICAR అన్నారు.