మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (08:38 IST)

ఆరేళ్లుగా 142 మంది విద్యార్థినిలపై ప్రిన్సిపాల్ అత్యాచారం...

victim woman
హర్యానా రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఆరేళ్లుగా విద్యార్థినిలపై ప్రిన్సిపాల్ అత్యాచారం చేస్తున్నాడు. ఈ కామాంధుడైన ప్రిన్సిపాల్ చేతిలో ఏకంగా 142 మంది విద్యార్థినిలు అత్యాచారానికి గురయ్యారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులే ఆరోపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి రాగా, పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
హర్యానా రాష్ట్రంలోని జింద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలో దాదాపు 390 విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 15 మంది విద్యార్థినులు తమపై ప్రిన్సిపల్ చేస్తోన్న అఘాయిత్యాల గురించి వివరిస్తూ గత ఆగస్టు నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లకు లేఖలు రాశారు. 
 
అల్గే, సెప్టెంబరు నెలలో హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ వారి లేఖను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని జింద్ పోలీసులకు సూచించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా లైంగిక వేధింపులు వాస్తవమేనని తేలడంతో నవంబర్ 4న ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి జ్యూడీషియల్ కస్టడీ విధించింది. 
 
ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడానికి మొదట 60 మంది విద్యార్థినులు ముందుకొచ్చారని, ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరిందని మహిళా కమిషన్ పేర్కొంది. ప్రిన్సిపాల్‌పై త్వరలో చార్జిషీట్‌ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబరు 16వ తేదీన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీప్తి గార్గ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశామని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.