Biodata Maker
✕

Kannappa: కన్నప్పకు కష్టాలు: కీలక సన్నివేశాల హార్డ్ డ్రైవ్ మిస్సింగ్.. కేసు నమోదు

Written By సెల్వి
Updated: మంగళవారం, 27 మే 2025 (12:05 IST)
కన్నప్ప సినిమా ప్రమోషన్స్ కోసం మంచు విష్ణు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లలో మునిగిపోయాడు. అయితే, కన్నప్పకు కష్టాలు తప్పలేలా లేవు. మంగళవారం కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలతో కూడిన హార్డ్ డ్రైవ్ కనిపించకుండా పోయిందని వెల్లడైంది. దానిని టీమ్ సభ్యుడు దొంగిలించాడని సమాచారం.
 
ముంబై నుండి వీఎఫ్ఎక్స్ బృందం పంపిన కీలకమైన హార్డ్ డ్రైవ్‌ను ఆఫీస్ బాయ్ దొంగిలించి, దానిని చరిత అనే అమ్మాయికి అప్పగించాడని, ఆమె అదృశ్యమైందని తెలిసింది. వెంటనే ఫిల్మ్ నగర్ పోలీసు అధికారులకు పోలీసు ఫిర్యాదు చేశారు. 
 
కన్నప్ప టీమ్ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, ఈ సినిమా కోసం పనిచేస్తున్న బృందం ప్రభాస్ లుక్‌ను ఇంటర్నెట్‌లో లీక్ చేసింది. మేకర్స్ ఆ వ్యక్తిని కనుగొని అతనిని ఉద్యోగం నుండి తొలగించారు. ఇప్పుడు, హార్డ్ డ్రైవ్‌లో చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.

కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. 

అన్నీ చూడండి

ఆరోగ్య శాఖలో కలకలం - నకలీ డెత్ సర్టిఫికేట్లతో కారుణ్య ఉద్యోగాలు

బంజారా హిల్స్‌లో పట్టపగలు దారుణ హత్య.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు... (వీడియో)

ఉద్యోగులకు దీపావళి కానుక : నగదు కట్టలు! (వీడియో)

సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సివస్తుందని బయటకు గెంటేసిన కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

అన్నీ చూడండి

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments