ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (22:19 IST)

క్యాస్టింగ్ కౌచ్ భారాన్ని నేను ఎప్పుడూ భరించలేదు..

Kirti Suresh
మహానటి, సర్కారు వారి పాట వంటి చిత్రాలలో నటించిన అగ్రనటి కీర్తి సురేష్ ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ భారాన్ని తాను ఎప్పుడూ భరించలేదని.. ఆ అవసరం లేనప్పటికీ, తన స్నేహితులు, సినీ రంగానికి చెందిన చాలామంది సహ నటులు తమకు ఎదురైన భయంకరమైన అనుభవాల గురించి చెప్పారని కీర్తి వెల్లడించింది. 
 
ఒక మీడియా పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కీర్తి సురేష్, క్యాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ ప్రబలంగా ఉన్న మాట నిజమేనని పేర్కొంది.  
 
తనతో పాటు సినిమాల్లో పనిచేస్తున్న చాలా మంది లైంగిక వేధింపుల గురించి తనపై బహిరంగంగా మాట్లాడారు. కానీ తనకు ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. తాను ఎలా ఉంటానో అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఎవరూ తప్పుడు ఆలోచనతో తనను సంప్రదించలేదు. భవిష్యత్‌లో అలాంటివి వచ్చే అవకాశం లేదంటూ కీర్తి సురేష్ తెలిపింది.