ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (12:42 IST)

సినీ నటి కిడ్నాప్ కేసు.. ఆ "మేడమ్" నేను కాదు : సింగర్ రిమి టామీ

మలయాళ సినీ నటి భావన కేసులో టీవీ వ్యాఖ్యాత, సింగర్ రిమి టామీని పోలీసులు ప్రశ్నించారు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన దిలీప్‌కు పల్సర్ సుని రాసిన లేఖలో ''మేడమ్'' అని సంబోధించాడు. ఈ మేడమ్ ఎవరనేదానిపై రిమీని ప

మలయాళ సినీ నటి భావన కేసులో టీవీ వ్యాఖ్యాత, సింగర్ రిమి టామీని పోలీసులు ప్రశ్నించారు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన దిలీప్‌కు పల్సర్ సుని రాసిన లేఖలో ''మేడమ్'' అని సంబోధించాడు. ఈ మేడమ్ ఎవరనేదానిపై రిమీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిమీ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఈ కేసులో సుని చెప్పిన మేడమ్ తాను కాదని రిమి టామీ చెప్పారు. బైజు పౌలోస్‌ అనే పోలీసు అధికారి తనకు ఫోన్ చేసి విదేశాల్లో తాను చేసిన స్టేజ్‌ షోల గురించి అడిగారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని పోలీసులకు తెలుసన్నారు. 
 
అయితే సినీనటి కిడ్నాప్ కేసులో తనకు లింకుందంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఎంతో బాధను కలిగించాయని.. ఇలాంటి వార్తలు ప్రసారం చేసే ముందుకు ఒక్కసారి తనను సంప్రదించివుంటే బాగుండేదని రిమీ వ్యాఖ్యానించింది. వేధింపులకు గురైన నటితో తనకు ఎటువంటి సమస్యలు లేవని ఆమె స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఆమెపై జరిగిన దాడి కుట్రలో తానెలా భాగస్వామినవుతానని టామీ ప్రశ్నించారు.
 
కాగా ఈ కేసులో దిలీప్‌ అరెస్టయిన నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం ఆయన భార్య కావ్య మాధవన్‌ను విచారించిన పోలీసులు, రిమి టామీని కూడా ప్రశ్నించారు.