అల్లు అర్జున్ పుష్పలో కైరా అద్వానీ ఐటమ్ సాంగ్..
దర్శకుడు సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కేక పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటుడు అల్లు అర్జున్‌తో పుష్ప మూవీని తెరకెక్కిస్తున్నాడు. అందునా ఈ కథ అడవి నేపథ్యంలో సాగేది కావడంతో, ఆ స్థాయిలోనే ఒక ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేశాడట. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ నటి కైరా అద్వానీని సంప్రదిస్తున్నట్టుగా సమాచారం.
ఇందుకు కైరా అద్వాని ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. శేషాచలం అరెస్టులో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. స్మగ్లింగ్ చేసే బృందంలోని వ్యక్తిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఇటీవల వదిలిన ఫస్టులుక్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇకపోతే.. అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న కొత్త సినిమా ''పుష్ప'' చేస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారని టాక్ వినిపించింది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కనిపించనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నారట.