బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (18:20 IST)

అజ్ఞాతవాసి: కొడకా కోటేశ్వర్ రావు పాట టీజర్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ పాట పాడారు. కొడకా కోటేశ్వర రావు అని సాగే పాటకు పవన్ గొంతిచ్చారు. కొత్త సంవత్సరం కానుకగా పవన్ పాడిన పాటను సినీ యూనిట్ విడుదల చే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ పాట పాడారు. కొడకా కోటేశ్వర రావు అని సాగే పాటకు పవన్ గొంతిచ్చారు. కొత్త సంవత్సరం కానుకగా పవన్ పాడిన పాటను సినీ యూనిట్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. పార్టీ పాటగా చెప్పుకునే ఈ పాట కొత్త సంవత్సరం ముందు రోజు డిసెంబర్ 31వ తేదీ ఆరు గంటలకు ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలిపారు. 
 
పవన్ అజ్ఞాతవాసి చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అజ్ఞాతవాసి ఆడియో రిలీజైంది. ప్రస్తుతం 31న పవన్ పాడిన పాట రిలీజైతే అజ్ఞాతవాసి జూక్‌బాక్సులో చేరుతుంది. ఇకపోతే.. అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడా అంటూ సాగే పాటను పవన్ పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట బంపర్ హిట్ అయ్యింది. ఇదే తరహాలో కొడకా కోటేశ్వర రావు పాట కూడా సూపర్ హిట్ సాంగ్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట టీజర్‌ను ఓ లుక్కేయండి.