ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (14:44 IST)

భాగమతి టీజర్: గుడ్ లక్ స్వీటీ అన్న ప్రభాస్

అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్‌పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా

అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్‌పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. 
 
బాహుబలిలో అనుష్కతో జతకట్టిన బాహుబలి ప్రభాస్.. భాగమతిపై ప్రశంసలు కురిపించాడు. 'ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు అనుష్క ప్రయత్నిస్తూనే వుంటుంది. గుడ్ లక్ స్వీటీ. గుడ్ లక్ యూవీ క్రియేషన్స్' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో పాటు భాగమతి టీజర్ కూడా అప్ లోడ్ చేశాడు.
 
టాలీవుడ్ ఫేవరెట్ ఆన్-స్క్రీన్ కపుల్‌గా పేరు సంపాదించిన ప్రభాస్- అనుష్క మంచి స్నేహితులు. బాహుబలికి తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇవన్నీ వదంతులేనని.. ప్రభాస్, అనుష్క కొట్టిపారేశారు. తాము స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు.