శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శనివారం, 12 డిశెంబరు 2020 (19:12 IST)

విజయవంతంగా షూటింగ్ పూర్తిచేసుకున్న 'కోతి కొమ్మచ్చి'

కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్లో షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. అయితే ఈ అసాధ్యాన్ని దిగ్విజయంగా సుసాధ్యం చేసి చూపించారు 'కోతి కొమ్మచి' టీం. నవంబర్ 3న మొదలైన కోతికొమ్మచ్చి షూటింగ్ డిసెంబర్ మొదటి వారంతో ఒక్క పాట మినహా టోటల్ షూట్ పూర్తయింది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'కోతి కొమ్మచ్చి. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ, "లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్‌కి పర్మీషణ్ ఇచ్చిన వెంటనే 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ మొదలుపెట్టాము. సినిమా మొత్తం అవుట్ డోర్ కావడంతో కరోనా ఎఫెక్ట్ వల్ల కొంత భయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎట్టకేలకు ఒక పాట మినహా టోటల్ షూటింగ్ పూర్తి చేశాం. అమలాపురం, విశాఖపట్నం, రాజమండ్రిలో ఎలాంటి బ్రేక్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరిపాము. ఈ సందర్భంగా షూటింగ్ దిగ్విజయంగా పూర్తవ్వడానికి కారణమైన యూనిట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. త్వరలోనే బ్యాలెన్స్ సాంగ్ ను కూడా పూర్తి చేసి విడుదల తేదిను ప్రకటిస్తాం" అన్నారు.
 
నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ,"కరోనా కష్టకాలంలో కూడా అనుకున్న విధంగా మా సినిమా షూటింగ్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేశాం. ముఖ్యంగా మా దర్శకుడు సతీష్ గారు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేసారు. మాకు సహకరించి సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ మా ప్రొడక్షన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించి ప్రేక్షకులను థియేటర్స్‌లో కలుసుకుంటాం"అన్నారు.
 
హీరోహీరోయిన్స్: మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్, మేఘ చౌదరి. మిగతా నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, వి.కే. నరేష్, సిజ్జు, అన్నపూర్ణమ్మ, రాజశ్రీ నాయర్, మణి చందన, ప్రవీణ్, సుదర్శన్, శివన్నారాయణ, ఆనంద్ వర్మ, చింటు, రచ్చ రవి తదితరులు.
 
సంగీతం: అనూప్ రుబెన్స్, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, సాహిత్యం: శ్రీమణి, ఆర్ట్: రామంజనేయులు, ఎడిటింగ్: మధు, పి.ఆర్.ఓ: రాజేష్ మన్నె, నిర్మాత: ఎం.ఎల్.వి.సత్యనారాయణ, రచన-దర్శకత్వం: వేగేశ్న సతీష్.