ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (22:54 IST)

ప్రభాస్-అనుష్క పెళ్లి.. ఇష్టపడితే వద్దంటామా.. శ్యామలా దేవి

Prabhas-Anushka
రెబల్ స్టార్ ప్రభాస్-అనుష్క.. ప్రేమ, పెళ్లి వార్తలు అభిమానులకు కొత్తేమికాదు. వీరిద్దరూ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారని, అప్పట్లో కృష్ణంరాజు వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో.. వేరేవారిని పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయారని వార్తలు వచ్చాయి. 
 
తాజాగా ప్రభాస్ పెళ్లి వార్తలపై పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి స్పందించింది. ప్రభాస్ నచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరూ కాదనరని చెప్పారు. తన పెళ్లి తన ఇష్టం. తన జీవితం ఎవరితో సంతోషంగా ఉంటుంది అనుకుంటాడో వారినే సెలక్ట్ చేసుకుంటాడు. అలా ఎవరిని ప్రభాస్ సెలెక్ట్ చేసుకున్నా మాకేమి అభ్యంతరం లేదని శ్యామలా దేవి అన్నారు.
 
ప్రభాస్ ది చాలా మంచి మనసు.. ఎంతో స్వచ్ఛమైనది. ఎదుటివాళ్ళ సంతోషంలోనే తన సంతోషాన్ని వెతికే వ్యక్తి ప్రభాస్.. అంటూ శ్యామలా దేవి వెల్లడించారు.