బుధవారం, 29 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By పీఎన్నార్
Last Updated: గురువారం, 23 జూన్ 2022 (11:46 IST)

"ఉప్పెన" భామకు మరో అవకాశం... చైతు సరసన మరోమారు

Kriti Shetty
ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కృతిశెట్టికి మరో అవకాశం లభించింది. ఇప్పటికే హ్యట్రిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా మరో అవకాశాన్ని దక్కించుకున్నారు. 
 
నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసే చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టిని ఎంపిక చేశారు. ఇది నాగ చైతన్యకు 22వ చిత్రం. శ్రీనివాస చిట్టూరి నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టిని ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. బంగార్రాజు తర్వాత చైతూ, కృతి కలిసి నటిస్తున్న రెండో చిత్రం కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, కృతిశెట్టి నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో "ఆ అమ్మాయి గురించి చెప్పాలి", "ది వారియర్", "మాచర్ల నియోజకవర్గం" చిత్రాలు ఉన్నాయి.