1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (19:40 IST)

ది వారియర్ నుంచి ఫస్ట్ టీజర్ రిలీజ్... (వీడియో)

Ram
Ram
ది వారియర్ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ టీజర్‌లో హీరో రామ్ పోలీస్ గెటప్‌లో అదరగొట్టాడు. మొదటిసారి పోలీస్ గెటప్ చేసినప్పటికీ, యాక్టింగ్‌లో ఇరగదీశాడు. అటు ఆది కూడా విలన్‌గా దుమ్ములేపేసాడు. అలాగే కృతిశెట్టి అందంతో కట్టిపడేసింది. 
 
టీజర్ చూస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ బాషలలో విడుదల కానున్న ఈ సినిమా రామ్ నుండి ప్రేక్షకులు కోరుకొనే ఎనర్జీ యాక్షన్ ఫీస్ట్‌గా ఉండనున్నట్లు కనిపిస్తుంది.
 
ఇకపోతే.. గతేడాదిలో వ‌చ్చిన "రెడ్‌"లో కూడా సిద్ధార్థ పాత్ర‌లో మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న ఎన్.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న "ది వారియ‌ర్" చిత్రంలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 14న విడుద‌ల కానుంది. 
 
ఈ క్ర‌మంలో చిత్ర బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తుంది. ఇప్పటికే ఇంటెన్సివ్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేసిన వారియర్ టీం తాజాగా శనివారం పక్కా యాక్షన్‌తో కూడిన ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది.