ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (16:11 IST)

కేఆర్కే అరెస్ట్: కరోనా వస్తే.. వాళ్లు చనిపోతారని ముందే తెలుసట!

KRK
KRK
బాలీవుడ్‌ సినీ విమర్శకుడిగా పొరేందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్కే)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.
 
కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్‌-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు.
 
తాజాగా కేఆర్కే కరోనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'కొంతమంది ప్రముఖులను తీసుకెళ్లకుండా కరోనా వెళ్లదన్నారు. పేర్లు చెప్పను కానీ అసలు విషయం తెలుసు.. ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌ లాంటి వాళ్లు చనిపోతారని. అంతేకాకుండా తర్వాత పైకి పోయేది ఎవరో కూడా నాకు తెలుసు' అంటే కేఆర్కే చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై కేసు నమోదవగా తాజాగా కేఆర్కేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2020లోఆయన చేసిన ఈ ట్వీట్‌ వివాదాస్పదమైంది. ఇంకా ఆయన అరెస్టుకు కారణమైంది.