1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (15:50 IST)

శృంగారానికి ముందు ఎవ్వరు కూడా ఆధార్ కార్డును చెక్ చేసుకోరు..

romance
శృంగారంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శృంగారంలో పాల్గొనే ముందు ఎవ్వరు కూడా ఆధార్ కార్డును చెక్ చేసుకోరని వ్యాఖ్యానించింది. అయితే, ఏకాభిప్రాయ సంబంధంతో ఉన్న వ్యక్తి తన భాగస్వామి పుట్టిన తేదీని పరిశీలించాల్సిన అవసరం లేదన్ని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేసమయంలో మూడు వేర్వేరు పుట్టిన తేదీతలతో ఉన్న మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది. 
 
ఒక వ్యక్తి ఆమెతో ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. అంటే ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకునే వ్యక్తి న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
 
అంతేకాకుండా బాధితారులిగా పేర్కొన్న వ్యక్తి ఖాతాలోకి భారీ మొత్తంలో డబ్బు బదిలీ చేయడాన్ని గమనించిన కోర్టు ఇది హనీట్రాప్ కేసు అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. గత 2019, 2021లో తనపై అత్యాచంర జరిగిందని బాధితురాలు ఆరోపించిన ఈ కేసులో ఇపుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసు నమోదుకు ఇంత ఆలస్యం ఎందుకు అయిందనే దానిపై సంతృప్తి కర కారణం చూపలేదని కోర్టు గుర్తించింది.